Header Banner

వైసీపీ నేతల్లో పెరిగిన టెన్షన్.. వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం.. 88 మందిపై పోలీసులు కేసు నమోదు!

  Thu Feb 13, 2025 19:31        Politics

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఇవాళ (గురువారం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. అయితే రెండ్రోజుల క్రితం హఠాత్తుగా సత్యవర్ధన్ కేసును వెనక్కి తీసుకున్నారు. అయితే వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరింపులు దిగారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. అందుకే అతను కేసు వెనక్కి తీసుకున్నారని పోలీసులకు చెప్పారు. ఈ మేరకు సత్యవర్ధన్‌ను పోలీసులు విచారించగా నిజమేనని తేలింది. దీంతో హైదరాబాద్‌లో ఉన్న వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. అయితే వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో 2019 ఎన్నికల సందర్భంగా నకిలీ పట్టాల పంపిణీ సహా వైసీపీ హయాంలో మట్టి కుంభకోణంపైనా వంశీపై కేసులు నమోదు అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రంగం సిద్ధం! తుది జాబితాలో నిలిచిన అభ్యర్థుల వివరాలు ఇవే!

 

నకిలీ పట్టాల కేసులో వంశీ పాత్ర లేదని పోలీసులు గతంలో తేల్చారు. అయితే అప్పట్లో విచారణ సరిగ్గా జరగలేదంటూ ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు కేసులు రీఓపెన్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేసులు పునఃవిచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రూ.210 కోట్ల మేర అక్రమ తవ్వకాలు జరిగాయని తేల్చింది. రాయల్టీ, సీనరేజ్ చెల్లించకుండానే తవ్వకాలు జరిపారని, అక్రమ తవ్వకాలతోపాటు విధించిన జరిమానా మొత్తం కలిపి ఆ విలువ రూ.210 కోట్లకు చేరిందని అధికారులు నివేదిక రూపొందించారు. అయితే విజిలెన్స్ ఫైల్ ఏపీ ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫైల్‌ను కూడా ఎన్డీయే ప్రభుత్వం త్వరలో బయటకు తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసు విచారణను ఏసీబీ లేదా సీఐడీ అప్పగించాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ వంశీకి కిడ్నాప్ కేసులో బెయిల్ వస్తే వెంటనే ఈ కేసులు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మోహన్ బాబు మరో ట్విస్ట్.. ఆ ఫిర్యాదు ఆధారంగా.. కుటుంబంలో కొంతకాలంగా గొడవలు!

 

ఏలూరులో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ! కారణం ఏంటో తెలుసా..!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీ లాంటి మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్!

 

ప‌వ‌న్ నుంచి ఈ ల‌క్ష‌ణాన్ని తాను కూడా అల‌వాటు చేసుకోవాల‌న్న హీరోయిన్‌! సోషల్ మీడియా లో వైరల్!

 

శ్రీకాకుళం జిల్లాలో వైరస్ కలకలం! పదేళ్ల బాలుడి మృతి.. వైద్యుల నివేదికపై ఉత్కంఠ!

 

నేడు (13/2) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VallabhaneniVamsi #TDPOffice #Attck #YSRCP #Arrest #Hyderabad